క్యాన్సర్ బారి నుండి బయట పడాలంటే ముందుగా గుర్తించడమే మందు: మంత్రి ఈటల

Minister Etela Rajender Launches Grace Cancer Run 2020

గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ రన్-2020 (గ్లోబ‌ల్ వ‌ర్చువ‌ల్ ర‌న్) ను శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. గ‌చ్చిబౌలి స్టేడియం వ‌ద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేబ్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఉపయోగించే వాహనాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య అధికమవుతోందని, 15 శాతం మరణాలు క్యాన్సర్ వల్లనే జరుగుతున్నాయని అన్నారు.

టెక్నాలజీ పెరిగినా కూడా జీవన విధానంలో మార్పులు, ఆహారపు అలవాట్లు మార్పు, ప్రశాంతత వదిలి పెట్టి డబ్బు కోసం పరిగెత్తుతున్న మాయా ప్రపంచం మనిషికి అనేక జబ్బులను తెచ్చిపెడుతుందని అన్నారు. క్యాన్సర్ అవగాహనపై ప్రభుత్వంతో పాటు అనేక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. క్యాన్సర్ బారి నుండి బయట పడాలంటే ముందుగా గుర్తించడమే మందు అని మంత్రి అన్నారు. క్యాన్సర్ పై అవగాహన పెంచుతున్న గ్రేస్ ఫౌండేషన్ కి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి స్వచ్చంధ సంస్థలకు పూర్తి మద్దతుగా ఉంటుందని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్యాన్సర్ ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీ లో చేర్చిందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =