త్వరలోనే దేశవ్యాప్తంగా సీఏఏ అమలు చేస్తాం: జేపీ నడ్డా

BJP Chief JP Nadda, BJP Chief JP Nadda Says CAA was Delayed by Corona, BJP President JP Nadda, CAA delayed by coronavirus, CAA delayed by Covid implementation soon, CAA will be implemented soon, JP Nadda, JP Nadda BJP National President, JP Nadda On CAA, national news, national news updates

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించాక, గత డిసెంబర్ లోనే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చట్టంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం నాడు మాట్లాడుతూ, కరోనావైరస్ మహమ్మారి కారణంగా పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ) అమలు ఆలస్యం అయిందని, త్వరలోనే ఈ చట్టం అమలు చేయబడుతుందని చెప్పారు. సీఏఏ అమలుకు బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని జేపీ నడ్డా పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జేపీ నడ్డా మాట్లాడుతూ, “పౌరసత్వ సవరణ చట్టంతో అందరికి ప్రయోజనాలు చేకూరతాయి. ఈ చట్టం అమలుకు మేము కట్టుబడి ఉన్నాము. కరోనావైరస్ కారణంగా చట్టం అమలు ఆలస్యం అయింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా సీఏఏ అమలు చేయబడుతుంది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =