కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు వచ్చే డిసెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం నాడు పార్లమెంట్ నూతన భవన నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణం డిసెంబర్ లో మొదలై అక్టోబర్ 2022 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు స్పీకర్ ఓం బిర్లాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు అమలును పరిశీలించడానికి ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
నూతన పార్లమెంట్ భవనంలో ప్రతి ఎంపీకి ప్రత్యేక ఆఫీస్, అలాగే కాన్‌స్టిట్యూషన్ హాల్, లైబ్రరీ, ఆరు కమిటీ రూమ్‌లు, ఎంపీల లాంజ్, డైనింగ్ ప్రదేశాలు, విశాల పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త భవనం నిర్మాణం జరిగేప్పుడు, ప్రస్తుత పార్లమెంట్ భవనంలో సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమీక్షకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu