జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల పీఎం మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం

Actor Jayaprakash Reddy, Actor Jayaprakash Reddy Dies, Celebrities On Demise Of Jayaprakash Reddy, Jayaprakash Reddy Death, Jayaprakash Reddy Dies of Heart Attack, PM Modi On Demise Of Jayaprakash Reddy, Sudden Demise Of Actor Jayaprakash Reddy, Telugu Actor Jaya Prakash Reddy Passes Away, Telugu actor Jayaprakash Reddy dies of heart attack, Telugu senior actor Jayaprakash Reddy

ప్రముఖ సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి మంగళవారం తెల్లవారుజామున గుంటూరులో గుండెపోటుతో మరణించారు. జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కె.చంద్రశేఖర్ రావు, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అగ్రకథానాయకులు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఇతర నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, అభిమానులు సంతాపం తెలిపారు. ఆయన మరణం నాటక, చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

“జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి” – ప్రధాని నరేంద్ర మోదీ

ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.

జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జయప్రకాశ్‌రెడ్డి మరణం పరిశ్రమకు తీరని లోటు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here