యూపీఎస్సీ సివిల్స్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 పోస్టుల భర్తీ

Union Public Service Commission Released Notification for Civil Services 2023 Exam Notified 1105 Vacancies,Union Public Service Commission,Released Notification for Civil Services,Civil Services 2023,Exam Notified 1105 Vacancies,Mango News,Mango News Telugu,Upsc Latest News And Updates,Upsc Prelims 2023 Syllabus,Upsc Mains 2023,Upsc Calendar 2023 24,Upsc 2023 Prelims Date,Upsc 2023 Calendar,Upsc,Union Public Service Commission,Union Public Service Commission News And Updates,Union Public Service Commission Posts,Union Public Service Commission Latest News,Union Public Service Commission 2022,Union Public Service Commission 2021,Union Public Service Commission

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ఫిబ్రవరి 1, బుధవారం నాడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ సంవత్సరం కమిషన్ మొత్తం 1105 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ఫిబ్రవరి 1వ తేదీ నుంచే ప్రారంభం కాగా, ఫిబ్రవరి, 21వ తేదీ సాయంత్రం 6.00 గంటల వరకు సమర్పించవచ్చని తెలిపారు. అర్హత గల అభ్యర్థులకు పరీక్ష ప్రారంభానికి మూడు వారాల ముందు ఈ-అడ్మిట్ కార్డ్ జారీ చేయబడుతుందని, అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ అడ్మిట్ కార్డ్ యూపీఎస్సీ వెబ్‌సైట్ https://upsconline.nic.in లో అందుబాటులో ఉంచబడుతుందన్నారు.

కాగా సివిల్స్-2023 ప్రిలిమినరీ పరీక్షను 2023, మే 28వ నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి తప్పనిసరిగా 21 ఏళ్లు నిండి ఉండాలి మరియు 2023 ఆగస్టు 1 నాటికి 32 ఏళ్ల వయస్సు కలిగి ఉండకూడదు. అలాగే అభ్యర్థి ఏదైనా విశ్వవిద్యాలయంలో డిగ్రీ/గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ రాత పరీక్షకు, అనంతరం ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. మెయిన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులు ప్రత్యేక దరఖాస్తు ఫారమ్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక సివిల్ సర్వీసెస్-2023 (మెయిన్) పరీక్షను 2023,సెప్టెంబర్ 15 నుంచి 5 రోజుల పాటు నిర్వహించనున్నారు.

యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్న పోస్టులివే:

  1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
  2. ఇండియన్ ఫారిన్ సర్వీస్
  3. ఇండియన్ పోలీస్ సర్వీస్
  4. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  5. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  6. ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  8. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  9. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  10. ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  11. ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  12. ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  13. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్) గ్రూప్ ‘ఎ’
  14. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఆదాయపు పన్ను) గ్రూప్ ‘ఎ’
  15. ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’ (గ్రేడ్ III)
  16. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  17. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్ ‘బి’ (సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్)
  18. ఢిల్లీ, అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ మరియు దాద్రా అండ్ నగర్ హవేలీ సివిల్ సర్వీస్ (డీఏఎన్ఐసీఎస్), గ్రూప్ ‘బి’
  19. ఢిల్లీ, అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ మరియు దాద్రా అండ్ నగర్ హవేలీ పోలీస్ సర్వీస్ (డీఏఎన్ఐసీఎస్), గ్రూప్ ‘బి’
  20. పాండిచ్చేరి సివిల్ సర్వీస్, గ్రూప్ ‘బి’
  21. పాండిచ్చేరి పోలీస్ సర్వీస్, గ్రూప్ ‘బి’

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + four =