నవంబర్ 26, 2008 నాడు ముంబయిలో జరిగిన పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన ఉగ్రవాది, జమాత్-ఉద్-దావా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ కోర్టు తాజాగా 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సహాయం చేశాడనే ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే రెండు కేసుల్లో హఫీజ్ సయీద్ ని దోషిగా తేల్చి 11 ఏళ్లు జైలు శిక్ష విధించారు. కాగా లాహోర్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు గురువారం నాడు హఫీజ్ సయీద్ సహా మరో నలుగురు జేయూడీ సభ్యులకు మరో రెండు కేసుల్లో 10 ఏళ్ళ పాటుగా శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్న సంగతి తెలిసిందే. అతను ప్రస్తుతం లాహోర్‌లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ