ఉద్యోగుల స్థానంలో ఏఐ.. స్టార్టప్ కంపెనీ సెన్సేషనల్ డెసిషన్

Bengaluru Startup Company Takes Sensational Decision To Replace Employees with AI,Bengaluru Startup Company,Startup Company Takes Sensational Decision,Decision To Replace Employees with AI,Employees with AI,Mango News,Mango News Telugu,AI, AI in place of employees, Dukaan Store Sensational decision, The CEO of the company is Sumit Shah, Saving time, Profitable enterprises,AI Stealing Jobs,Bengaluru start up dukaan,AI replaces employees,Bengaluru Startup Company Latest News,Bengaluru Startup Company Latest Updates,Bengaluru Startup Company Live News

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడయితే అడుగుపెట్టిందో.. ఇన్ని సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇంజనీర్లుగానూ, టీచర్లుగానూ, సర్జన్లగానూ, ఇంటి పనుల్లోనూ, చివరకు మీడియా రంగంలో అడుగుపెట్టి యాంకర్లుగానూ, అన్నిటా తానై అడుగుపెట్టిన AI.. ఇప్పుడు మనిషి ఉనికికే సవాల్ విసురుతుంది. AIతో జీతాలకే జీవితాలకు కూడా మనుగడ ఉండదన్న నిపుణుల మాటలను అక్షరాలా నిజం చేస్తుంది. కృత్రిమ మేధ (AI) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రమంగా అన్ని రంగాలకు విస్తరించేస్తోంది ఇప్పటికే కొన్ని సంస్థలు ఉద్యోగులకు బదులుగా ఏఐతో సేవలను అందించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాయి.

తాజాగా బెంగళూరు (Bengaluru) కేంద్రంగా పనిచేసే దుకాణ్‌ (Dukaan) అనే ఈ-కామర్స్‌ స్టార్టప్ కంపెనీ (An e-commerce startup company) సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. తమ సంస్థలో కస్టమర్‌ కేర్‌ డిపార్టుమెంటు (Customer care department)లో పనిచేసే 90 శాతం మంది ఉద్యోగులను.. ఏఐతో భర్తీ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. దీనిపై కంపెనీ సీఈవో సుమిత్‌ షా (The CEO of the company is Sumit Shah) ట్వీట్ చేస్తూ.. మా సంస్థలో 90 శాతం మంది కస్టమర్‌ సపోర్ట్ టీమ్‌ను ఏఐతో భర్తీ చేశామని చెప్పారు.

ఈ నిర్ణయం కష్టమైనదే.. కానీ, తప్పడంలేదని.. సంస్థ లాభాల వాటా (Company profit share)ను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు. దీనివల్ల కస్టమర్‌కేర్‌ నిర్వహణ (For customer care management) కోసం కంపెనీ ఖర్చు చేసే మొత్తం 85 శాతం తగ్గిందని చెప్పుకొచ్చారు. అలానే, తమ కస్టమర్లకు అందించే సర్వీసులకు రెండు గంటల నుంచి మూడు నిమిషాలకు తగ్గడం వల్ల.. కస్టమర్ల సమయాన్ని వృధా చేయకుండా ఉండటంతో పాటు తమ సమయాన్ని మరి కొంతమంది కస్టమర్ల కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు. దుకాణ్‌ సీఈవో నిర్ణయాన్ని (Store CEO decision) పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. అయితే, ట్విటర్‌లో తన నిర్ణయాన్ని తప్పుబడుతున్న వారంతా.. లింక్డ్‌ఇన్‌ (LinkedIn)లో ఇచ్చిన వివరణ చూడాలని కంపెనీ సీఈవో సుమిత్‌ కోరారు.

ఆయన లింక్డ్‌ఇన్‌లో ఇచ్చిన వివరణ ప్రకారం.. దేశ ఆర్థిక వ్యవస్థ (Economy of the country)ను దృష్టిలో ఉంచుకుని చాలా వరకు స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారాలని అనుకోవడంలేదని సుమిత్ చెప్పారు. లాభదాయకమైన సంస్థలు (Profitable enterprises)గా మాత్రమే కొనసాగాలని భావిస్తున్నాయని..ఇలా కస్టమర్‌కేర్‌ విభాగంలో ఏఐను వినియోగించడం వల్ల సమయం ఆదా అవడం (Saving time)తోపాటు, వేగవంతమైన సేవ (Fast service)లను అందివ్వొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ఉద్యోగులను ఏఐ భర్తీ చేయగలదని తాను భావించడంలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. సమర్థవంతమైన ఉద్యోగుల (Effective employees)కు ఒకే విధమైన బాధ్యతలను అప్పగించడం కంటే, కంపెనీ అభివృద్ధికి తోడ్పడే ఇతర విభాగాల్లో వారికి విధుల (Duties in other departments)ను అప్పగించడం సరైన నిర్ణయమని లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో వివరించారు.

మరోవైపు, తమ సంస్థలో కస్టమర్‌కేర్ డిపార్టుమెంటు (For customer care management)లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులే అని, వారికి రోజూ ఒకే విధమైన బాధ్యతలు (Similar responsibilities) అప్పగించడం వల్ల డ్యూటీలో చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారని.. సంస్థ అంతర్గత సర్వేలో వెల్లడైనట్లు సుమిత్ చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన వారు సంస్థలోని ఏఐ, ఈ-కామర్స్‌ (E-commerce), ప్రొడక్ట్‌ డిజైన్ (Product design) వంటి విభాగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు (Apply for jobs) చేసుకోవచ్చని సూచించారు. అయితే సుమిత్ ఇచ్చిన వివరణ కంటి తుడుపుగా మాత్రమే ఉందని, ఇప్పుడు ఉద్యోగులు రోడ్డున పడితే ఈ వివరణలు ఎందుకు పనికొస్తాయని కొందరు అంటుంటే.. తాము బతకడానికి కంపెనీ పెట్టుకున్న యజమాని లాభాల కోసమే చూసుకుంటాడు కానీ..నష్టాలను కాదు. ఒక బిజినెస్ మ్యాన్‌గా ఆలోచిస్తే ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టేనని సుమిత్‌కు మద్దతు ఇస్తున్నారు మరికొంతమంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =