‘మన్ కీ బాత్‌’లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రసంగం

PM Modi Addresses 89th Edition of Mann Ki Baat Today on Occasion of Completion of 8 Years of The BJP Government, 89th Edition of Mann Ki Baat Today on Occasion of Completion of 8 Years of The BJP Government, Modi Addresses 89th Edition of Mann Ki Baat Today on Occasion of Completion of 8 Years of The BJP Government, 89th Edition of Mann Ki Baat Today, Occasion of Completion of 8 Years of The BJP Government, Completion of 8 Years of The BJP Government, Mann Ki Baat, Mann Ki Baat News, Mann Ki Baat Latest News, Mann Ki Baat Latest Updates, Mann Ki Baat Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ‘మన్ కీ బాత్’ 89వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు. మే 26న బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘మన్ కీ బాత్’ అనేది ప్రధాని మోదీ సూచనా మేరకు ప్రతి నెలా నిర్వహించే ఒక రేడియో కార్యక్రమం. దీనిలో ఆయన ప్రతి ఎపిసోడ్‌లో దేశానికీ సంబంధించిన పలు విషయాలపై మాట్లాడతారు. ఇది ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఆధీనంలోని ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్ టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారం చేయబడుతుంది. మన్ కీ బాత్ మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 3, 2014న ప్రసారం చేయబడింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం లోని కొన్ని కీలక అంశాలు..

  • కొన్ని రోజుల క్రితం నేను జపాన్ వెళ్ళాను. ఈ సందర్భంగా కొందరు అద్భుతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం వచ్చింది.
  • జపాన్‌కు చెందినప్పటికీ వారు భారతదేశంపై అద్భుతమైన ప్రేమను కలిగి ఉన్నారు, వారిలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ హిరోషి కోయికే ఒకరు.
  • జూన్ 21న ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని జరుపుకోనుంది, ఈ ఏడాది థీమ్ ‘యోగా ఫర్ హ్యుమానిటీ’. దీనిలో అందరూ భాగస్వాములు కావాలి.
  • ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉంది. మెరుగైన టీకాల ప్రభావం కారణంగా మహమ్మారిపై మనం త్వరలోనే పైచేయి సాధించనున్నాం.
  • కేదార్‌నాథ్‌లో కొందరు యాత్రికులు చెత్తను వేయడంతో దర్శనానికి వెళ్లిన ఇతర భక్తులు కలత చెందుతున్నారు. మనం పవిత్ర తీర్థయాత్రకు వెళ్లి అక్కడ చెత్త వేయడం సరికాదు.
  • మే 5న, భారతదేశంలో స్టార్టప్‌ (యూనికార్న్‌)ల సంఖ్య స్వల్ప కాలంలోనే 100 మార్కుకు చేరుకుంది.
  • కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్ళు పూరి చేసుకుంది. ఈ ప్రయాణంలో ఎన్నో కఠిన సవాళ్ళను అది ఎదుర్కొంది.
  • ‘ప్రధాన మంత్రి సంగ్రహాలయ’ మ్యూజియం మాజీ ప్రధానుల గౌరవార్ధం ఏర్పాటు చేసుకున్నాం. వారు దేశానికీ చేసిన సేవలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనేదే దీని ముఖ్యోద్దేశం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =