ఏపీలో సీఎంఆర్ఎఫ్ పై కీలక నిర్ణయం, ఆరోగ్యశ్రీలో లేని వ్యాధుల చికిత్సకే సహాయం

AP Govt Decided to Pay CMRF Assistance Only for Diseases that are Not Listed in Aarogyasri

ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందని వ్యాధులకు మాత్రమే సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న జబ్బుల వైద్యానికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ సహాయం నిమితం ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు తీసుకోవద్దని, ఆరోగ్యశ్రీలో లేకుండా చికిత్స పొందితేనే దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు.

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రి బిల్లు 1000 రూపాయలు దాటితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స అందించే కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో అమల్లోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ పథకంలో గతంలో 1,059 వ్యాధులకు చికిత్స అందిస్తుండగా, ప్రస్తుతం క్యాన్సర్ తో సహా 2,434 వైద్య ప్రక్రియలకు ఉచితంగా చికిత్సలు వర్తించే విధంగా మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ సహాయం విషయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ