టిఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Telangana BJP President Bandi Sanjay Predicts Midterm Elections in the State

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలిపోయే అవకాశముందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పారు. కేంద్రం అన్ని లెక్కలు తేల్చుతుందని, ఆదివారం నాడు అమిత్ షా వస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మరోవైపు రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయన్న బండి సంజయ్‌ వ్యాఖ్యల్ని టిఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటిఆర్‌ కొట్టిపారేశారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని, ఆయన చేసిన పిచ్చి వ్యాఖ్యల్ని పట్టించుకోమని అన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ