కరోనా పరీక్షల్లో కీలక మైలురాయి దాటిన ఏపీ, కోటికి పైగా పరీక్షలు నిర్వహణ

Covid-19 in AP: More Than 1 Crore Samples Tested Till Now

ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక కోటికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించి ఏపీ కీలక మైలు రాయిని అధిగమించింది. నవంబర్ 29, ఆదివారం ఉదయానికి రాష్ట్రంలో 1,00,17,126 కరోనా‌ పరీక్షలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటికీ ఒక్క ల్యాబొరేటరీ కూడా లేని స్థాయి నుంచి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 150 ల్యాబ్‌లలో వేగంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తూ కరోనా నియంత్రంలో ఏపీ ముందువరుసలో నిలిచింది. దేశంలో ఇప్పటికి జరిగిన మొత్తం కరోనా పరీక్షల్లో 7.18 శాతం ఏపీలో నిర్వహించారు. కేవలం ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే ఇప్పటికి కోటికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించాయి. కరోనా పరీక్షలు అధికంగా నిర్వహించిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా, తర్వాత స్థానాల్లో తమిళనాడు, బీహార్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్ ఉన్నాయి.

అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించ రాష్ట్రాలు:

  • ఉత్తరప్రదేశ్ : 1,91,70,240
  • బీహార్ : 1,45,47,988
  • తమిళనాడు: 1,19,97,385
  • కర్ణాటక : 1,10,20,300
  • మహారాష్ట్ర: 1,08,04,422
  • ఆంధ్రప్రదేశ్: 1,00,17,126
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ