ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం

Andhra Legislative Assembly, Andhra Pradesh Assembly Winter Session, AP Assembly, AP Assembly session begins, AP Assembly Winter Session, AP Assembly Winter Session Highlights, AP assembly winter session News, AP Assembly Winter Session Started, AP Assembly Winter Sessions, AP Assembly Winter Sessions 2020, Mango News, Winter session of Andhra Pradesh assembly, Winter sessions of AP Assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 30, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, పలువురు ప్రజాపతినిధుల మృతికి సంబంధించిన సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదించింది. అనంతరం స్పీకర్‌‌ తమ్మినేని సీతారాం కొద్దిసేపు సభను వాయిదా వేశారు. తర్వాత స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్, పలువురు రాష్ట్ర మంత్రులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. డిసెంబర్‌ 4 వరకు అనగా మొత్తం 5 రోజుల పాటుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో మొత్తం 19 బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 2 =