100 శాతం సీటింగ్ సామర్ధ్యంతో సినిమా థియేటర్స్ నడపడానికి అనుమతి

Cinema halls, Mango News Telugu, Multiplexes In Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu Cinemas, Tamil Nadu Govt, Tamil Nadu Govt Latest News, Tamil Nadu Govt Permits to Run Theatres, Tamil Nadu Govt Permits to Run Theatres Multiplexes with 100 Percent Seating, Tamil Nadu News, Tamil Nadu Political News, Theatres

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్స్, మల్టీఫ్లెక్స్ లు ప్రస్తుతం 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్స్ సీటింగ్ సామర్థ్యంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌ ల సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుండి 100 శాతం వరకు పెంచడానికి తాజాగా తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో థియేటర్స్ తెరవడంపై జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొజిజర్) అనుసరించడంతో పాటుగా, ప్రేక్షకులలో అవగాహన కల్పించడానికి ప్రదర్శన సమయంలో కోవిడ్-19 కోసం ముందు జాగ్రత్త చర్యలుపై ఓ వీడియోను ప్రదర్శించాలని సూచించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజేషన్ మరియు భౌతిక దూరం వంటి కోవిడ్-19 నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.

ముందుగా తమిళనాడు రాష్ట్రంలో నవంబర్ 10 నుండి 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌ లు తెరుచుకున్నాయి. కాగా తమిళనాడు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మరియు స్టార్ హీరో విజయ్ ఇటీవలే ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి థియేటర్లను 100 శాతం సామర్ధ్యంతో తెరవడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 100 శాతం సీటింగ్ సామర్ధ్యానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ