ఇండోనేషియా దేశంలో విమానం అదృశ్యం అయింది. ఆ దేశ రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన శ్రీవిజయ బోయింగ్ 737-500 సిరీస్ కు చెందిన SJ182 ఎయిర్ విమానంకు టేకాఫ్ అయిన కొద్దీ నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని ఆ దేశ రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విమానంలో 46 మంది ప్రయాణికులు, ఏడుగురు పిల్లలు, ముగ్గురు చిన్నారులు మరియు ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. విమాన ఆచూకీ కోసం అధికారులు అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషణ చేస్తున్నారు. ఈ విమాన అదృశ్యంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ