తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం

Corona Vaccination Drive, coronavirus vaccine distribution, covid 19 vaccine, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, Mango News, Telangana Government, Telangana Government All Set To Begin COVID-19 Vaccination Drive, Vaccine Distribution

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభ‌మైంది. ముందుగా శనివారం ఉద‌యం 10:30 గంట‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం నగరంలోని గాంధీ ఆసుపత్రిలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా తోలి కరోనా వ్యాక్సిన్ ను స‌ఫాయి క‌ర్మ‌చారి ఎస్.కిష్టమ్మ కు ఇచ్చారు. రాష్ట్రంలో క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్య‌క్తిగా ఆమె గుర్తింపు పొందారు. వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఆమెతో మాట్లాడి ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణలో తొలిరోజున మొత్తం 140 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేష‌న్ కార్యక్రమం చేపడుతున్నారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 140 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తిలక్ నగర్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ