తెలంగాణలో ప్రారంభమైన రెండో డోస్ కరోనా‌ వ్యాక్సిన్ పంపిణీ

Second Dose Corona Vaccination Program Started in Telangana

తెలంగాణ రాష్ట్రంలో శనివారం నుంచి సెకండ్ డోస్ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా తోలి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్స్ కు సెకండ్ డోస్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. మొదటి డోస్‌ తీసుకున్న కేంద్రంలోనే సెకండ్ డోస్ ‌వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. అదేవిధంగా లబ్ధిదారులకు మొదటి డోస్ ఏ వ్యాక్సిన్ (కోవిషీల్డ్/ కోవాక్జిన్) అందిస్తే మళ్లీ అదే వ్యాక్సిన్‌ అందించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు తెలంగాణలో ఫిబ్రవరి 12, శుక్రవారం నాటికీ 2,77,825 మంది లబ్ధిదారులకు(హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు) మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొదటి డోస్ వ్యాక్సిన్‌ తీసుకోని సిబ్బంది ఫిబ్రవరి 25 లోగా తీసుకోవాలని సూచించారు. అలాగే రెండో డోస్ వ్యాక్సినేషన్ పక్రియ మూడు వారాలపాటుగా కొనసాగనుందని చెప్పారు. ఇక మార్చి రెండో‌వా‌రంలో 50 ఏళ్ళు పైబ‌డి‌న‌వా‌రికి, దీర్ఘ‌కా‌లిక వ్యాధు‌లతో బాధ‌ప‌డు‌తు‌న్న‌ ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించనున్నట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ