తెలంగాణలో పదోతరగతి విద్యార్థులంతా పాస్, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Telangana Govt Issued GO to Declare the Results As Pass for All 10 th Class Students,Mango News,Mango News Telugu,Telangana Govt,Telangana SSC Result 2021,Telangana SSC Result,Telangana SSC,Telangana SSC Exams,Telangana 10th Class,Telangana 10th Class Students,SSC Result,Telangana Government To Declare All Pass For Class 10 Students,SSC Result 2021,Telangana Board Announced Results Last Year,Telangana SSC Exams 2021,Telangana 10 Board Exam,Telangana Declare 100 Persent Result In Class 10 Board Exam,All Pass In Class 10,All Class 10 Students Pass,Telangana SSC News,Telangana 10th,All 10th students pass

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ మంగళవారం నాడు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/జిల్లాపరిషత్/ఎయిడెడ్/ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మరియు వివిధ నిర్వహణ సంస్థల కింద ఉన్న అన్ని పాఠశాలలోని పదో తరగతి (ఎస్‌ఎస్సీ/ఓఎస్‌ఎస్సీ/ఒకేషనల్) విద్యార్థులను పాస్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కాగా ఇంట‌ర్న‌ల్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గ్రేడ్‌లు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.

కరోనా కారణంగా రెండు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్స్ బదులు విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్-1 (ఎఫ్‌ఏ-1) మాత్రమే నిర్వహించారు. ఎఫ్‌ఏ-1 కు 20 మార్కులు కేటాయించగా, ప్రస్తుతం విద్యార్థులకు అందులో వచ్చిన మార్కులను 100కి లెక్కించి గ్రేడులను కేటాయించనున్నారు. మరోవైపు బోర్డు నిర్ణయించిన ప్రాతిపదికన విద్యార్థులు/విద్యార్థినిలకు కేటాయించిన మార్కులతో ఎవరైనా సంతృప్తి చెందకపొతే, వారికీ పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరీక్ష రాసే అవకాశం ఇవ్వబడుతుందని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 4 =