ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ వేలంలో ఉండే 292 మంది క్రికెటర్లతో కూడిన తుది జాబితాను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. 292 మంది క్రికెటర్లలో 164 మంది భారత్, 125 మంది విదేశీ, ముగ్గురు అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు. కాగా ఈ వేలం ద్వారా 8 ప్రాంఛైజీలు కలిపి 61 మంది ఆటగాళ్లను తీసుకోనున్నారు. వీరిలో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్ళు ఉండే అవకాశం ఉంది.
ఈ వేలంలో ముఖ్యంగా గ్లెన్ మాక్స్ వెల్, స్టీవ్ స్మిత్, డేవిడ్ మలన్, ఆరోన్ పించ్, క్రిస్ మోరిస్, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, ముజబీర్ రెహ్మాన్, మార్క్ వుడ్ వంటి విదేశీ ఆటగాళ్లు, శివమ్ దూబే, ఉమేష్ యాదవ్, హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, అర్జున్ టెండూల్కర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. 8 ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లవైపు మొగ్గుచూపుతాయో ఆసక్తికరంగా మారింది. అత్యధికంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 11 మంది ఆటగాళ్లను, పంజాబ్ కింగ్స్ 9, రాజస్థాన్ రాయల్స్ 9, కోల్‌కతా నైట్ రైడర్స్ 8, ఢిల్లీ క్యాపిటల్స్ 8, ముంబయి ఇండియన్స్ 7, చెన్నై సూపర్ కింగ్స్ 6, సన్ రైజర్స్ హైదరాబాద్ 3 ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది.
వేలం కోసం ప్రాంచైజీల ఖాతాలో ఉన్న నగదు వివరాలివే:
- పంజాబ్ కింగ్స్ – రూ.53.20 కోట్లు
- రాజస్థాన్ రాయల్స్ – రూ.37.85 కోట్లు
- రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు – రూ.35.40 కోట్లు
- చెన్నై సూపర్ కింగ్స్ – రూ.19.90 కోట్లు
- ముంబయి ఇండియన్స్ – రూ.15.35 కోట్లు
- ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.13.4 కోట్లు
- కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ.10.75 కోట్లు
- సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ.10.75 కోట్లు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ