రైతుల ఉద్యమం: నేడు నాలుగు గంటల పాటు రైల్ రోకో కార్యక్రమం

Farmer Unions Call For Rail Roko Andolan, Farmer Unions Call For Rail Roko Andolan Against Three Farm Laws, Farmers Protest, Farmers Protest Against Farm Bills, Farmers Protest Against Farm Laws, Farmers Protest Continues, Mango News, Rail Roko Andolan, Rail Roko Andolan Against Three Farm Laws, Rail Roko Andolan Against Three Farm Laws Today, Three Farm Laws

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్న రైతులు ఫిబ్రవరి 18, గురువారం నాడు దేశవ్యాప్తంగా ‘రైల్‌ రోకో’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. ఇప్పటికే జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ, ఫిబ్రవరి 6 న ‘చక్కా జామ్’ పేరుతో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల దిగ్బంధనం చేపట్టిన రైతు సంఘాల నేతలు, తాజాగా ‘రైల్‌ రోకో’ కార్యక్రమాన్ని కూడా శాంతియుతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

రైతుల రైల్ రోకో నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా 20 వేల అదనపు ఆర్‌పిఎస్‌ఎఫ్ దళాలను రైల్వే స్టేషన్ల మోహరించారు. పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలపై దృష్టి సారించి అదనపు భద్రతా బలగాలను మోహరించారు. అలాగే పలు చోట్ల ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ అరుణ్ కుమార్ వెల్లడించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 6 =