బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్స్: రోహిత్‌, కోహ్లీ, జడేజా, బుమ్రాకు ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్లలో ఎవరున్నారంటే?

BCCI Announces Annual Player Contracts for Team India for the 2022-23 Season,BCCI Announces Annual Player Contracts,Team India Annual Player Contracts,Player Contracts for Team India for the 2022-23 Season,Mango News,Mango News Telugu,BCCI announces Team India central contracts,BCCI announces annual player retainership,BCCI announces India men's central contracts,Ravindra Jadeja promoted to A+ category,Bhuvneshwar Kumar out of BCCI,BCCI Latest News,BCCI Latest Updates

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2022–2023 సీజన్‌ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్ల కింద మొత్తం 26 మంది ఆటగాళ్ల వార్షిక వేతనాల కాంట్రాక్టులను బీసీసీఐ నిర్ణయించింది. ఏడాదికి రూ.7 కోట్లు చొప్పున చెల్లించే ఏ+ గ్రేడ్ లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా,పేస్ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నారు. ఇక ఏ గ్రేడ్‌ కింద రూ.5 కోట్లు, బీ గ్రేడ్‌ కింద రూ.3 కోట్లు, సీ గ్రేడ్ కింద‌ రూ.కోటి చొప్పున ఆటగాళ్లకు చెల్లించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

అయితే గత ఏడాది ‘సీ’ గ్రేడ్ లో ఉన్న హార్ధిక్ పాండ్యా, ‘బీ’ గ్రేడ్ లో ఉన్న అక్షర్ పటేల్ లను తాజాగా ‘ఏ’ లో చేర్చారు. అలాగే స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఏ నుంచి బీ గ్రేడ్ కు మార్చబడ్డాడు. తాజా కాంట్రాక్ట్‌ జాబితాలో అజింక్య రహానే, భువనేశ్వర్‌ కుమార్, ఇషాంత్‌ శర్మ, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, మయాంక్‌ అగర్వాల్, దీపక్‌ చాహర్‌ చోటు కోల్పోయారు.

కొత్త కాంట్రాక్ట్ ల జాబితా:

ఏ+ గ్రేడ్‌ కాంట్రాక్ట్ (రూ.7 కోట్లు):

 • విరాట్‌ కోహ్లీ
 • రోహిత్‌ శర్మ
 • రవీంద్ర జడేజా
 • జస్ప్రీత్‌ బుమ్రా

ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ ‌(రూ.5 కోట్లు):

 • హార్ధిక్ పాండ్యా
 • రవిచంద్రన్‌ అశ్విన్‌
 • రిషభ్‌ పంత్‌
 • అక్షర్‌ పటేల్‌
 • మహమ్మద్‌ షమీ

బీ గ్రేడ్ కాంట్రాక్ట్ ‌(రూ.3 కోట్లు):

 • కేఎల్‌ రాహుల్‌
 • చటేశ్వర్‌ పుజారా
 • శ్రేయస్‌ అయ్యర్‌
 • మహ్మద్‌ సిరాజ్‌
 • సూర్యకుమార్ యాదవ్
 • శుభ్‌మన్‌ గిల్‌

‌సీ గ్రేడ్ కాంట్రాక్ట్ ‌(రూ.1 కోటి):

 • ఉమేశ్‌ యాదవ్‌
 • శిఖర్‌ ధావన్‌
 • శార్దూల్‌ ఠాకూర్‌
 • ఇషాన్ కిషన్
 • దీపక్ హుడా
 • యుజువేంద్ర చాహల్‌
 • కుల్దీప్ యాదవ్
 • వాషింగ్టన్‌ సుందర్‌
 • సంజు శాంసన్
 • అర్షదీప్ సింగ్
 • కేఎస్ భరత్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here