కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయిన రైలు సేవలను రైల్వే శాఖ దశలవారీగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే దశలవారీగా ఇప్పటికే 180 స్పెషల్ రైళ్లను నడుపుతుంది. తాజాగా ప్రయాణీకుల సౌలభ్యం కోసం రైలు సర్వీసుల పునరుద్ధరణలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్ 1, 2021 నుండి మరో 22 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. కాగా ఈ స్పెషల్ రైళ్లు అన్ని రిజర్వేషన్ విధానంలో నడవనున్నాయి. మూడు నెలల ముందు నుంచే రిజర్వేషన్ కు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే కనీసం రైలు ప్రారంభానికి 4 గంటల ముందుగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్టేషన్ కౌంటర్లలో టికెట్స్ ఇవ్వకుండా, రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తునట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఏప్రిల్ 1 నుంచి పునరుద్దరించబడే 22 స్పెషల్ రైళ్ల వివరాలు:
- విజయవాడ-సికింద్రాబాద్ (02799) – ప్రతి రోజు
- సికింద్రాబాద్-విజయవాడ (02800) – ప్రతి రోజు
- గుంటూరు-కాచిగూడ (07251) – ప్రతి రోజు
- కాచిగూడ-గుంటూరు(07252) – ప్రతి రోజు
- సికింద్రాబాద్-విశాఖపట్టణం (02739) – ప్రతి రోజు
- విశాఖపట్టణం-సికింద్రాబాద్ (02740) – ప్రతి రోజు
- ఆదిలాబాద్-నాందేడ్ (07409) – ప్రతి రోజు
- నాందేడ్-ఆదిలాబాద్(07410) – ప్రతి రోజు
- సికంద్రాబాద్-యస్వంత్ పూర్ (02735) – వారానికి మూడుసార్లు (బుధ, శుక్ర, ఆది)
- యస్వంత్ పూర్-సికంద్రాబాద్ (02736) – వారానికి మూడుసార్లు (సోమ, గురు, శని)
- విజయవాడ-సాయినగర్ షిర్డీ (07207) – వారానికి ఒకసారి – మంగళ
- సాయినగర్ షిర్డీ-విజయవాడ (07208) – వారానికి ఒకసారి – బుధ
- ఔరంగాబాద్-రేణిగుంట (07621) – వారానికి ఒకసారి – శుక్ర
- రేణిగుంట-ఔరంగాబాద్ (07622) – వారానికి ఒకసారి – శని
- నాందేడ్-హెఛ్.నిజాముద్దీన్ (02753) – వారానికి ఒకసారి – మంగళ
- హెఛ్.నిజాముద్దీన్-నాందేడ్ (02754) – వారానికి ఒకసారి – బుధ
- నాందేడ్-సంత్రాగచి (02767) – వారానికి ఒకసారి – సోమ
- సంత్రాగచి-నాందేడ్ (02768) – వారానికి ఒకసారి – బుధ
- నాందేడ్-ఔరంగాబాద్ (07619) – వారానికి ఒకసారి – శుక్ర
- ఔరంగాబాద్-నాందేడ్ (07620) – వారానికి ఒకసారి – సోమ
- నాందేడ్-శ్రీ గంగానగర్ (07623) – వారానికి ఒకసారి – గురు
- శ్రీ గంగానగర్-నాందేడ్ (07624) – వారానికి ఒకసారి – శని
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ