ఆ రాష్ట్రంలో 9-11 విద్యార్థులకు పరీక్షలు రద్దు, ఉద్యోగుల పదవీవిరమణ పెంపు

9 10 11 Class Students will Promote without Any Exams In Tamil Nadu, Mango News, Palaniswami, Palaniswami Announces 9 10 11 Class Students will Promote, Tamil Nadu, Tamil Nadu Class 9 10 and 11 students to be promoted, Tamil Nadu CM, Tamil Nadu CM Palaniswami, Tamil Nadu News, Tamil Nadu SSLC, Tamil Nadu to Promote Class 9 10 & 11 Students, Tamil Nadu to promote Class 9-11 students without exams, Tamil Nadu To Promote Students Of Class 9-11, TN Board Exam 2021

ఈ ఏడాది విద్యార్థుల వార్షిక పరీక్షలకు సంబంధించి తమిళనాడు సీఎం పళనిస్వామి గురువారం నాడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరానికి చెందిన 9, 10, 11 తరగతుల విద్యార్థుల‌కు వార్షిక ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం పళనిస్వామి ప్రకటించారు. వారికీ ఎలాంటి పరీక్షలు లేకుండా తదుపరి తరగతికి ప్రమోట్ చేయనున్నట్టు వెల్లడించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎస్‌ఎస్‌ఎల్‌సి (పదో తరగతి), ప్లస్ వన్ (ఇంటర్ ఫస్ట్ ఇయర్) పరీక్షలను నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని వైద్య నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. కాగా ఆయా తరగతుల విద్యార్థులను వారి ఇంటర్నల్ మార్క్స్ అంచనా ఆధారంగా ప్రమోట్ చేయనున్నారు.

మరోవైపు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు కూడా పెంచారు. ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 59 సంవత్సరాల నుండి 60 కి పెంచుతున్నట్టు సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం పళనిస్వామి వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవలే రూ.12,110 కోట్లతో రాష్ట్రంలో దాదాపు 16.43 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగేలా రుణాలు మాపీ చేయనున్నట్లు కూడా ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =