కరోనా వ్యాప్తి: 4 రాష్ట్రాల ప్రయాణికులకు కరోనా‌ నెగెటివ్ రిపోర్ట్‌ తప్పనిసరి చేస్తూ నిర్ణయం

Covid Negative Report, Covid Negative Report Mandatory For Travellers, Covid Negative Report Mandatory For Travellers From 4 States, Mango News, West Bengal, West Bengal Coronavirus, West Bengal Coronavirus Cases, West Bengal Coronavirus News, West Bengal COVID 19, West Bengal Makes Covid Negative Report Mandatory, West Bengal Travelling Restrictions

దేశంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్ళీ ప్రయాణ ఆంక్షలు వైపు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా మమతాబెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక వంటి నాలుగు రాష్ట్రాల నుంచి పశ్చిమబెంగాల్ ‌కు విమానాల్లో వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు ‌తప్పనిసరి చేసింది. బెంగాల్ కు వచ్చే ప్రయాణికులు ప్రయాణం ప్రారంభానికి 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, కరోనా నెగెటివ్‌ రిపోర్టు చూపించాలని బెంగాల్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆ నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ నిబంధనలు ఫిబ్రవరి 27, శనివారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. మరోవైపు ఇప్పటికే కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు కూడా పలు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తూ ఆంక్షలు విధించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 2 =