గాంధీ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Covid-19 Vaccine at Gandhi Hospital, First Dose of COVID-19 Vaccine, Gandhi Hospital, Kishan Reddy, Kishan Reddy Received Covid-19 Vaccine, Kishan Reddy Received Covid-19 Vaccine at Gandhi Hospital, Kishan Reddy Received First Dose of Covid-19 Vaccine, Mango News, Union Minister, Union Minister Kishan Reddy, Union Minister Kishan Reddy Received First Dose, Union Minister Kishan Reddy Received First Dose of Covid-19 Vaccine

దేశంలో రెండో దశ కరోనావ్యాక్సినేషన్ లో భాగంగా మార్చి 1 న ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. గాంధీలో కిష‌న్ రెడ్డి వ్యాక్సిన్ తీసుకునే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా అక్కడే ఉన్నారు. వ్యాక్సిన్‌ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, వైద్యులు మరియు ఇతర కరోనా వారియర్స్ కు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అర్హత కలిగిన ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ