కరోనాతో బీజేపీ లోక్‌సభ ఎంపీ నంద్‌కుమార్‌ సింగ్‌ చౌహాన్‌ కన్నుమూత

BJP leader Nandkumar Singh Chauhan passes away, BJP MP Nand Kumar Singh Chauhan passes away, BJP MP NandKumar Singh Chauhan, BJP MP NandKumar Singh Chauhan Who was Tested Positive, Madhya Pradesh BJP, Madhya Pradesh BJP MP Nandkumar Singh Chauhan, Mango News, MP Nandkumar Singh Chauhan, Nand Kumar Singh, Nand Kumar Singh Chauhan, NandKumar Singh, NandKumar Singh Chauhan Who was Tested Positive for Covid-19 Passed Away

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ లోక్‌సభ ఎంపీ నంద్‌కుమార్‌ సింగ్‌ చౌహాన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఎంపీ నంద్‌కుమార్‌ సింగ్‌ చౌహాన్ కి జనవరి 11 న కరోనా పాజిటివ్ గా తేలడంతో ముందుగా భోపాల్ ‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం ఆయన్ను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ పైనే ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టుగా వైద్యులు వెల్లడించారు.

ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఖండ్వా లోక్‌సభ నియోజకవర్గం నుంచే నంద్‌కుమార్‌ సింగ్‌ చౌహాన్ పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలు అందించారు. ఎంపీ నంద్‌కుమార్‌ సింగ్‌ చౌహాన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + fourteen =