మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. మార్చి 19, శుక్రవారం నాడు కూడా 25681 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24,22,021 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 53,208 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 14,400 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 21,89,965 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 90.42 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.20 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,77,560 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి మహారాష్ట్రలో 1,80,83,977 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ