ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రణాళికపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నాలుగైదు వారాల్లో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించి, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్లు, వాలంటీర్లు, ఆశావర్కర్లు, హెల్త్ వర్కర్లు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. వచ్చే సోమవారం నుంచి అర్భన్ ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలన్నారు.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా మండలంలో వారానికి 4 రోజులు, రోజుకు 2 గ్రామాల చొప్పున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తయి ఉంటే యంత్రాంగం అంతా కరోనా వ్యాక్సినేషన్ పక్రియపై పూర్తిస్థాయి దృష్టి పెట్టే అవకాశముండేదని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో, వ్యాక్సినేషన్‌కు అడ్డంకులు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ