తెలంగాణలో లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు విడుదల, అనుమతి ఉన్నది వీటికే…

Telangana Lockdown Guidelines and Rules,Mango News,Mango News Telugu,CM KCR,Lockdown,Telangana CM KCR,Telangana News,Lockdown In Telangana State,CM KCR Live,Telangana Lockdown Updates,Telangana State,CM KCR,Telangana Lockdown Live Updates,Telangana Lockdown News,Covid-19,Covid-19 In Telangana,Telangana Lockdown,Lockdown In Telangana,Telangana News,Telangana Lockdown News,Telangana Lockdown Update Today,Telangana,Telangana Lockdown Updates,Lockdown News In Telangana,Telangana Live News,Telangana News Live,Telangana Govt,Telangana Lockdown Guidelines,Telangana Lockdown Rules,Telangana Lockdown Complete Guidelines,Telangana Lockdown Guidelines And Rules Latest News,Telangana Lockdown Guidelines Live Updates,Telangana Lockdown Guidelines Live,Lock Down Guidelines Release

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ విధింపు తదితర అంశాలకు సంబంధించి కీలకనిర్ణయాలు తీసుకుని, మార్గదర్శకాలను ప్రకటించారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని తెలిపారు. అలాగే లాక్‌డౌన్‌ నుంచి పలు రంగాలకు మినహాయింపులు కల్పించారు.

లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు ఇవే :

  1. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్‌డౌన్‌ వర్తించదు.
  2. తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
  3. వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
  4. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.
    విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.
  5. జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.
  6. జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.
  7. కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు.
  8. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు.
  9. ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.
  10. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
  11. గత లాక్‌డౌన్‌ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.
  12. అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి.
  13. అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.
  14. తెలంగాణ చుట్టూ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం.
  15. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.
  16. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.
  17. కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది.
  18. సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని కేబినెట్ నిర్ణయం.
  19. ఈ మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని కేబినెట్ ఆదేశించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ