తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ పై స్పష్టతనిచ్చిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్

Covid Vaccination Program in Telangana will Continue only for Age Group 45 Year + for 2nd Dose,Mango News,Mango News Telugu,Telangana Lockdown,Telangana,Covid-19 in Telangana,Covid-19 Updates In Telangana,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Telangana Coronavirus Updates,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,Covid Vaccination Program in Telangana,Covid Vaccination,Covid Vaccine,Covid Vaccination in Telangana,Vaccination Resumed For 45 Year + Age People in Telangana,Covid Vaccination will Continue only for Age Group 45 Year + for 2nd Dose,45 Year + for 2nd Dose,Covid Vaccination 2nd Dose

రాష్ట్రంలో మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ సమయంలో అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, రోగనిర్ధారణ మరియు పరీక్షా కేంద్రాలు యథావిథిగా పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ పై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టత నిచ్చారు. తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా 45 ఏళ్లుపైబడిన వారికి రెండో డోసు కరోనా వ్యాక్సిన్ మాత్రమే అందించనున్నట్టు తెలిపారు.

రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హత ఉన్నవారికి ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని చెప్పారు. మొదటి డోసు తీసుకున్న రోజు నుంచి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ తీసుకున్న వారికీ 6 వారాలు, కోవాక్జిన్ తీసుకున్న వారికీ 4 వారాలు తర్వాత రెండవ డోసు తీసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. రెండవ డోసు తీసుకునేందుకు అర్హత ఉన్న వారందరూ సమీప వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి ఐడెంటిటీ కార్డు మరియు పాక్షిక కరోనా వ్యాక్సినేషన్ ధృవీకరణ పత్రాన్ని చూపించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =