వైఎస్ఆర్ బీమా పథకంలో మార్పులు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం

AP CM YS Jagan held Review Meeting, AP CM YS Jagan Held Review Meeting on YSR Bhima Scheme, AP CM YS Jagan Review Meeting on YSR Bhima Scheme, AP Review Meeting on YSR Bhima Scheme, AP YSR Bhima Scheme, Mango News, Review Meeting on YSR Bhima Scheme, YSR Bhima Scheme, YSR Bhima Scheme In AP, YSR Bhima Scheme News, YSR Bhima Scheme Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ‘వైఎస్ఆర్ బీమా’ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా వైఎస్ఆర్ బీమా పథకంలో కీలక మార్పులు చేస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబంలో సంపాదిస్తున్న 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి సహజంగా మరణిస్తే రూ.1 లక్ష, అలాగే సంపాదిస్తున్న వ్యక్తి వయసు 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు.

ఈ పథకంలో కొత్త మార్పులు జూలై1 తేదీనుంచి అమలులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. జూలై 1 లోగా సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన క్లెయిమ్‌ లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పలు కేటగిరులు కింద దరఖాస్తు చేసుకున్న బీమా పరిహారాలన్నింటిని నెల రోజుల్లోనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, బీమా పరిహారంకు సంబంధించి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం వైఎస్ జగన్‌ ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + nineteen =