సౌథాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ 2021 తోలి ఆట పూర్తిగా రద్దు చేయబడింది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు నుంచే సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తుండడంతో స్టేడియంలో పిచ్ ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. టాస్ సమయానికి వర్షం ఎక్కువగా ఉండడంతో పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు ముందుగా తొలి సెషన్ వరకు ఆటను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 7:30 గంటల సమయంలో వర్షం ఆగిపోవడంతో మరోసారి స్టేడియంలో పరిస్థితిని పరిశీలించారు. స్టేడియంలో వర్షం నీరు నిలిచి ఉండడంతో తోలి ఆటను పూర్తిగా రద్దు చేస్తునట్టు ప్రకటించారు.
గత కొన్నిరోజులుగా ఎంతో ఆసక్తి రేపిన ఈ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ తొలిరోజున వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడకపోవడంతో క్రీడాభిమానులు నిరాశకు గురయ్యారు. బీసీసీఐ స్పందిస్తూ దురదృష్టవశాత్తు వర్షం కారణంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తోలి రోజు ఆట రద్దు చేయబడిందని ట్వీట్ చేసింది. ఇక రెండో రోజు నుంచి అయినా వర్షం అంతరాయం లేకుండా ఆట సజావుగా సాగితే, తొలిరోజు కోల్పోయిన ఆట సమయాన్ని రిజర్వ్ డే (జూన్ 23) నాడు నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఈ టెస్టులో అంతరాయం కారణంగా ఎలాంటి ఫలితం తేలకపోతే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ ను ఇరు జట్లకు పంచనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ