ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో శనివారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తపేటలో ప్రస్థుతం వున్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే జీహెఛ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ ఆసుపత్రిని ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తూ, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.
టిమ్స్ కు తోడుగా మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని, మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కేబినెట్ మంజూరు చేసింది. వీటిని ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పటల్ ప్రాంగణంలో, అలాగే ఇటీవలే గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో మరియు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో ఆల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ