ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, పలువురు యూపీ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అయోధ్య నగర అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని మోదీకి అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆధ్యాత్మిక కేంద్రంగా, గ్లోబల్ టూరిజం హబ్ గా మరియు స్థిరమైన స్మార్ట్ సిటీగా అయోధ్యలో అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య నగరంతో కనెక్టివిటీని మరింత మెరుగుపరచడానికి ఎయిపోర్ట్, రైల్వే స్టేషన్ విస్తరణ, బస్ స్టేషన్, రోడ్లు, హైవేలు వంటి వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ సమీక్షలో చర్చించారు.
భక్తులకు బస సౌకర్యాలు, ఆశ్రమాలు, మఠాలు, హోటళ్ళు, వివిధ రాష్ట్రాల భవన్లుతో కూడిన గ్రీన్ ఫీల్డ్ టౌన్ షిప్, మరియు పర్యాటక సదుపాయాల కేంద్రం, ప్రపంచ స్థాయి మ్యూజియం నిర్మాణంపై కూడా చర్చించారు. మరోవైపు సారు నది, దాని ఘాట్ల చుట్టూ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సర్యూ నదిపై క్రూయిజ్ ఆపరేషన్ వాటిపై చర్చించారు. అయోధ్యను ప్రతి భారతీయుడి సాంస్కృతిక స్పృహలో ఉన్న నగరంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. రాబోయే తరాలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా అయోధ్యను సందర్శించాలనే కోరిక కలిగేలా గొప్ప స్థాయిలో అయోధ్యను అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ