దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు, తక్షణమే కఠిన చర్యలుంటాయి – సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Orders Probe into Dalit Woman Mariamma Lockup Death Case, Dalit Woman Death Case, Dalit Woman Death Case Enquiry, Dalit Woman Mariamma Lockup Death Case, death of a dalit woman, death of a dalit woman in Telangana, Mango News, Mariamma Death Case, Mariamma Lockup Death Case, telangana, Telangana HC Orders Enquiry In Dalit Woman Death Case, Telangana HC Orders Inquiry into Dalit Woman’s Death, Telangana HC orders judicial inquiry into death of Dalit

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం తెలిపారు. కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేయాలని, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందచేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. చింతకానికి వెల్లి లాకప్ డెత్ సంఘటన పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డీజీపీని సీఎం ఆదేశించారు.

సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో సీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. మరియమ్మ లాకప్ డెత్ సంఘటనలో పోలీసుల తీరు పట్ల సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 28వ తేదీన స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసన సభా పక్షనేత భట్టి విక్రమార్కతో కలిసి స్థానిక మంత్రి పువ్వాడ అజయ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు సహా జిల్లా కలెక్టర్, ఎస్సీ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి రావాలని సీఎం సూచించారు.

దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు, తక్షణమే కఠిన చర్యలుంటాయి:

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘దళితుల పట్ల సమాజం దృక్పథం మారవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పోలీసుల ఆలోచనా ధోరణి, దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. శాంతి భధ్రతలను కాపాడడంలో గుణాత్మక అభివృద్దిని సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో, ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. వీటిని క్షమించం. దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు. తక్షణమే కఠిన చర్యలుంటాయి. ఈ లాకప్ డెత్ కు కారణమైన వారిపై విచారణ నిర్వహించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదు. అవసరమైతే ఉద్యోగం లోంచి తొలగించాలి’’ అని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో హోంశాఖా మంత్రి మహమూద్ అలీ, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + eleven =