హైదరాబాద్ లో కోవిడ్ కంట్రోల్ రూమ్‌ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Covid Command Centre established in Hyderabad, Covid Control Room set up at Hyderabad, Hyderabad, KT Rama Rao flags off Covid Command Centre, KTR inaugurates COVID control room in Hyderabad, KTR Opens Covid Command Centre, Mango News, Minister KTR Inaugurated Covid Control Room set up, Minister KTR Inaugurated Covid Control Room set up at Hyderabad, Minister KTR inaugurates Covid Control Room, Telangana Govt sets up COVID-19 Command Center, Telangana Minister KT Rama Rao

హైదరాబాద్ వెంగళరావు నగర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అఫ్ హెల్త్ మరియు ఫ్యామీలి వెల్ఫేర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖా మంత్రి కె.టి.రామారావు శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అఫ్ హెల్త్, ఫ్యామీలి వెల్ఫేర్ డైరెక్టర్ అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

ఈ కంట్రోల్ రూమ్ కోవిడ్-19కి సంబంధించిన మొత్తం డేటాను తీసుకుని నిర్వహించడం ద్వారా, పరిపాలనా వ్యవస్థకు ఉపయోక్తంగా వుండి పరిస్థితిని పూర్తిగా నియంత్రించడంలో సహాయపడుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నమ్మకమైన, విశ్వాసనీయ వైద్య సేవల సలహా కేంద్రంగా ప్రజలకు సమాచారాన్నిఅందిస్తుందన్నారు. కోవిడ్-19 సమాచారాన్ని తీసుకుని క్రోడీకరించి వివరాలు అందించే ఎగ్జిక్యూటివ్ డాష్‌బోర్డ్ గురించి అధికారులు మంత్రికి వివరించారు. కోవిడ్ చికిత్సకు సంబంధించిన వసతులు, మందులు, పరికరాల సరఫరా స్థితి, వాటి కేటాయింపు విధానాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులకు సహాయపడే డేటా అనలిటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసే వ్యవస్థ గురించి వివరించారు. ఈ కోవిడ్ కంట్రోల్ రూమ్ లో కమాండ్ సెంటర్, కాల్ సెంటర్, టెలిమెడిసిన్ మొదలైనవి ఉన్నాయి. అనంతరం, అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పౌరులు 1905 కు డయల్ చేసి పరీక్ష మరియు టీకా కేంద్రాలు, అంబులెన్స్ సేవలు, ఆసుపత్రిలో చేరడం వంటి అన్ని కోవిడ్ సంబంధిత సేవల గురించి సమాచారం పొందవచ్చు. సర్వీస్ ప్రొవైడర్లను మరియు కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్న సిబ్బందిని మంత్రి కేటీఆర్ అభినందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =