తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ప్రణబ్ తనయుడు అభిజిత్‌ ముఖర్జీ

Former President Pranab Mukherjee's Son Abhijit Mukherjee Joins Trinamool Congress Party

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ సోమవారం నాడు తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)లో చేరారు. గత కొన్ని రోజులుగా అభిజిత్‌ ముఖర్జీ టీఎంసీ చేరనున్నాడంటూ మొదలైన ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, ఆయన టీఎంసీ జెండా కప్పుకున్నారు. పార్టీలో చేరిన అనంతరం అభిజిత్ ముఖర్జీ మాట్లాడుతూ, ఇటీవల బీజేపీ మతతత్వ వేవ్ ను మమతా బెనర్జీ నిలిపివేసిన విధానం చూస్తే, భవిష్యత్తులో ఇతరుల సహకారంతో, ఆమె మొత్తం దేశంలో కూడా అదే విధంగా చేయగలదని నేను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఒక కార్యకర్తగా టీఎంసీలో చేరానని, ఆ పార్టీ సూచనల మేరకు పని చేస్తానని చెప్పారు. మరోవైపు ఇప్పటివరకు కాంగ్రెస్ తరపున జంగిపూర్‌ లోక్‌సభ నియోజకర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా, నల్‌హతి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభిజిత్ ముఖర్జీ గెలుపొందారు. ఇక త్వరలో జరగనున్న జంగిపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో అభిజిత్ ముఖర్జీకి టీఎంసీ టికెట్‌ ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ