గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Goldman Sachs, Goldman Sachs Office, Goldman Sachs Office in Hyderabad, Goldman Sachs to hire 2000 people in its Hyderabad office, Hyderabad, KTR, KTR Inaugurates Goldman Sachs Office in Hyderabad, Mango News, Minister KTR Inaugurates Goldman Sachs Office, Telangana attracting major investments in BFSI, Telangana IT and Industries Minister, Telangana IT and Industries Minister KTR Inaugurates Goldman Sachs Office in Hyderabad

హైదరాబాద్‌ నగరంలోని రాయ‌దుర్గంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్‌ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం నాడు ప్రారంభించారు. భారతదేశంలో తమ ఇంజనీరింగ్, బిజినెస్ ఇన్నోవేషన్ గ్లోబల్ సెంటర్ ను విస్తరించే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్‌ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫ్ గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్ సర్వీసెస్ ఇన్ ఇండియా గుంజన్ సంతాని, చైర్మన్ అండ్ సీఈఓ సోంజోయ్ చటర్జీ, ఐటీ అండ్ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ బిఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) పెట్టుబడులకు కేంద్రంగా మారిందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ అనేక మల్టీనేషనల్ బ్యాంకింగ్ దిగ్గజాలను ఆకర్షించిందని చెప్పారు. అందులో భాగంగా అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు మరియు ఆర్థిక సేవలు కంపెనీ అయిన గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్ సర్వీసెస్ కూడా 2021లో ఈ జాబితాలో చేరిందని తెలిపారు. గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్ రాకతో హైదరాబాద్ నగరంలో బిఎఫ్‌ఎస్‌ఐ ఎకో సిస్టమ్ మరింత బలంగా మారిందన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ