కేరళ రాష్ట్రంలో జూలై 24, 25 తేదీల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమ‌లు

Kerala Govt Announced Complete Lockdown on July 24, 25 th

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వీకెండ్ అనగా జూలై 24, శనివారం మరియు జూలై 25, ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని ముఖ్యమంత్రి పిన‌రయి విజ‌య‌న్ నేతృత్వంలోని కేరళ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జూన్ 12 మరియు 13 తేదీలలో జారీ చేసిన లాక్‌డౌన్ మార్గదర్శకాలతోనే వచ్చే వీకెండ్ లాక్‌డౌన్ కూడా అమలు చేయనున్నట్టు తెలిపారు.

అలాగే ఏడు రోజుల సగటు టెస్ట్ పాజిటివిటీ రేట్ 10 శాతంపైన ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి కేరళ రాష్ట్రవ్యాప్తంగా జూలై 23, శుక్రవారం నాడు 3 లక్షల కరోనా పరీక్షల లక్ష్యంతో కరోనా పరీక్షా క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. కరోనా నియంత్రణలో భాగంగా ఇకపై రోజువారీ కరోనా పరీక్షలను కూడా పెద్దఎత్తున పెంచాలని సూచించారు. మరోవైపు కేరళలో ఇప్పటివరకు మొత్తం 32,05,197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 30,59,441 మంది కరోనా నుంచి కోలుకోగా, 15,617 మంది మరణించారు. ప్రస్తుతం 1,29,640 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో కేరళ రెండో స్థానంలో కొనసాగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ