టీటీడీలో వారసత్వ అర్చకుల శాశ్వత నియామకంపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు

AP Govt, AP Govt Appointed One Man Committee over Permanent Basis Priests Appointments in TTD, Mango News, One Man Committee over Permanent Basis Priests, One Man Committee over Permanent Basis Priests Appointments in TTD, One Man Committee over Permanent Basis Priests In TTD, Permanent Basis Priests Appointments in TTD, Tirumala Tirupati Devasthanam, TTD, TTD Another key decision of the AP government, TTD Latest News, TTD Priests

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో వంశపారంపర్య అర్చకుల శాశ్వత నియామకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకంపై ఏకసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణపై తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచించనుంది. కమిటీ ఛైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.శివ శంకర్‌రావును నియమించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వారసత్వ అర్చకుల శాశ్వత నియామకం ఉందని, ఈ నేపథ్యంలో టీటీడీ అర్చకులు, భక్తుల విజ్ఞప్తులతో ఏకసభ్య కమిటీని నియమించినట్లు తెలిపారు. అర్చకుల శాశ్వత నియామకాలపై అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఏకసభ్య కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − ten =