రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరు హైదరాబాద్ రావద్దని పార్టీ శ్రేణులకు, అభిమానులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ ఆదేశాల ఇచ్చిన నేపథ్యంలో, పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు .
“ఈ నేపథ్యంలో రేపు ఎవరిని కలవడం లేదని, ఈ విషయంలో అన్యధా భావించవద్దని పార్టీ శ్రేణులను కోరుతున్నాను. ఇప్పటికే విజ్ఞప్తి చేసిన మేరకు తమకు తోచిన విధంగా ఎవరికి వారు ఇతరులకు సహాయం అందిస్తూ, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో వికలాంగులకు ఇవ్వనున్న ద్విచక్రవాహనాల కార్యక్రమాన్ని వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి వాటన్నిటిని నా కార్యాలయ సిబ్బంది క్రోడీకరించి, ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ వాహనాలను అందజేయడం జరుగుతుంది” అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ