సీఎం జగన్ కీలక నిర్ణయం, ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

Andhra Pradesh schools, Andhra Pradesh schools reopen, Andhra Pradesh schools reopen news, Andhra Pradesh schools to reopen, Andhra Pradesh schools to reopen on August 16, CM YS Jagan Orders officials to Start Schools, CM YS Jagan Orders officials to Start Schools in the State, CM YS Jagan Orders officials to Start Schools in the State from August 16th, Mango News, Schools in Andhra Pradesh to reopen, Schools in Andhra Pradesh to reopen on August 16, YS Jagan Orders officials to Start Schools in the State

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారం నాడు విద్యాసంస్థల్లో నాడు-నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే మొదటి విడత నాడు-నేడు పనులను కూడా అప్పుడే ప్రజలకు అంకితం చేయాలని సీఎం వైఎస్ జగన్‌ నిర్ణయించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు-నేడు పనుల్లో అవినీతికి ఎలాంటి తావుండకూడదని చెప్పారు. పిల్లల కోసం నాడు-నేడుతో మంచి కార్యక్రమం చేపట్టామని, పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదన్నారు. నాడు-నేడు పనులపై చిన్న వివాదం కూడా రాకూడదని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభించిన రోజే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టడం జరగుతుందని, నూతన విద్యా విధానం గురించి కూడా ప్రభుత్వం సమగ్రంగా వివరిస్తుందని సీఎం వైఎస్ జగన్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + fourteen =