ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు మూడో ఏడాది ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకం కింద రూ.192.08 కోట్ల నిధులు విడుదల చేశారు. నేతన్న నేస్తం కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 80,032 చేనేత కుటుంబాలు లబ్దిపొందనుండగా, వారి ఖాతాల్లోకి రూ.24 వేల చొప్పున రూ.192.08 కోట్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా అర్హులై ఉండి సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.24వేలను ఏపీ ప్రభుత్వం అందిస్తుంది. ఐదేళ్లల్లో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 సాయం ఆర్థికసాయం అందనుండగా, నేటితో మూడువిడతల్లో వారి ఖాతాల్లో రూ.74,000 జమ అయ్యాయి. మరోవైపు గత రెండేళ్లలో చేనేతలకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందచేయగా, నేడు మూడో విడత రూ.192.08 కోట్లతో కలిపి మొత్తం ఇప్పటివరకు రూ.576.07 కోట్ల సాయాన్ని అందించినట్లయింది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని చెప్పారు. పాదయాత్ర సమయంలో చేనేతల కష్టాలు చూశానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరుసగా మూడో ఏడాది కూడా వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చేనేతలకు ఆర్ధిక సాయం అందిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామని, ఆప్కో ద్వారా ఈ-మార్కెటింగ్ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇంకా అర్హత ఉండి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారంతా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ