నేతాజీ అస్తికలు భారతదేశానికి తీసుకురావాలి, అదే నా కోరిక – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Jana Sena Chief Pawan Kalyan Demands to Bring Back Netaji Ashes to India, Pawan Kalyan Demands to Bring Back Netaji Ashes to India, Jana Sena Chief Pawan Kalyan, Bring Back Netaji Ashes to India, Netaji Ashes to India, Netaji Ashes, Jana Sena Chief Pawan Kalyan, Jana Sena Chief, Pawan Kalyan, Ashes of Netaji, Janasenani demanded to Bring Back the ashes of Netaji to India, Janasenani, Ashes of Netaji Latest News, Ashes of Netaji Latest Updates, Subhas Chandra Bose, Subhas Chandra Bose Ashes to India, Ashes of Subhas Chandra Bose, Mango News, Mango News Telugu,

నేతాజీ అస్తికలు తిరిగి భారత దేశానికి తీసుకురావాలన్నదే తన కోరిక అని, అలాగే దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరిక అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ ఆధ్వర్యంలో ఎం.వి.ఆర్.శాస్త్రి రాసిన నేతాజీ గ్రంధం సమీక్ష కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జపాన్ దేశంలోని రెంకోజీ టెంపుల్ లో ఉండిపోయిన నేతాజీ అస్తికలు రెడ్ ఫోర్ట్ లో పెట్టాలని, దానిపై భారత మువ్వన్నెల జెండా ఎగరాలని డిమాండ్ చేశారు. అది చూసి ఆయన ఆత్మ శాంతించాలని, అది మనందరిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పూర్తిని నింపాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

అందుకోసం ఈ సభ నుంచి దేశం మొత్తం మాట్లాడుకునేలా నేతాజీ తాలూకు అస్తికలు తిరిగి దేశానికి తెప్పించేందుకు ప్రభుత్వాధినేతల మీద, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రజలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అందరం ఒక మాట మీద ఉండి ఒత్తిడి తీసుకురాకపోతే ఉదాసీనత నిండిన వ్యక్తుల్లో చలనం రాదని అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదిక నుంచే మనం ఆ పోరాటాన్ని మొదలుపెడదాం. అది ఒక రోజు దేశం మొత్తం విస్తరించాలి. నేతాజీ అస్తికలు భారతదేశంలోకి రావాలి. మనం ఆయనకు సెల్యూట్ చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కోన్నారు. అందుకోసం బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాషెస్, రెంకోజీ టూ రెడ్ ఫోర్ట్ అనే హ్యాష్ ట్యాగ్ లు రూపొందించారు. నేతాజీ అస్తికలు దేశంలోకి తీసుకురావడంతో పాటుగా, కనీసం 100 రూపాయిల నోటు మీద నేతాజీ బొమ్మ పడాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + three =