తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 12, గురువారం నాడు 1,19,290 మందికి మొదటి డోస్, 62,591 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,81,881 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. అలాగే గురువారం రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,59,02,597 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 1,18,21,275 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 40,81,322 మంది లబ్ధిదారులకు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. ఇక 18-44 ఏళ్ల వయసు కేటగిరిలో ఇప్పటికి 56,54,304 మంది మొదటి డోసు, 7,99,727 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ