గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో జరిగిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో పారిపోతున్న నిందితుడు శశికృష్ణను వెంబడించి పట్టుకున్న ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీ ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ, గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ అభినందించారు. కాలువలో దూకి మరీ ముద్దాయిని వెంబడించి వైనం, మారణాయుధముతో బెదిరించినా వెన్నుచూపని ధీరత్వం, చాకచక్యంగా ముద్దాయిని పట్టుకున్న నేర్పరితనం, పోలీస్ శాఖకు కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన సాహసం అని అన్నారు. జిల్లా పోలీస్ అధికారులతో పాటు తోటి సిబ్బంది యొక్క మన్ననలు పొందిన హెడ్ కానిస్టేబుల్ రఫీ ధైర్య సాహసానికి మెఛ్చి రూ.5000 నగదు రివార్డ్ మరియు ప్రశంసా పత్రాన్ని ఎస్పీ విశాల్ గున్నీ అందజేశారు.
విధి నిర్వహణ పట్ల అంకితభావం కలిగిన సిబ్బంది రూరల్ జిల్లాలో ఉండటం గర్వకారణం అని, తన సిబ్బందిని దగ్గరుండి ప్రోత్సహించినందుకు ముప్పాళ్ళ ఎస్ఐ పట్టాభిరామయ్య కి రూరల్ ఎస్పీ అభినందనలు తెలిపారు. పోలీస్ అధికారులు ఇటువంటి సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో రఫీ చూపిన తెగువ గుంటూరు రూరల్ జిల్లా పోలీసులకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకే గర్వకారణమని ఎస్పీ విశాల్ గున్నీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ