ఏపీ అసెంబ్లీలో 3 రాజధానులపై చర్చ.. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉంది – సీఎం జగన్

AP Budget Session CM YS Jagan Participates in The Debate of 3 Capitals in Assembly, CM YS Jagan Participates in The Debate of 3 Capitals in Assembly, Debate of 3 Capitals in Assembly, Debate of 3 Capitals, YS Jagan Participates in The Debate of 3 Capitals in Assembly, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM YS Jagan, Budget Session, AP Assembly Budget Session, Assembly Session 2022, AP Budget Session 2022, Budget Session, Andhra Pradesh Budget Session, AP Budget Session, 2022 AP Budget Session, AP Assembly Budget Session 2022-23, AP Assembly Budget Session 2022, AP Assembly Budget Session, AP Assembly Budget, Andhra Pradesh assembly budget session, AP Budget 2022-23, AP Budget 2022, AP Budget, Andhra Pradesh, Andhra Pradesh Assembly, AP Assembly, AP Assembly Session, Budget Session 2022, Mango News, Mango News Telugu,

ఏపీకి మూడు రాజధానుల విషయంలో కట్టుబడి ఉన్నామని, అభివృద్ధి వికేంద్రీకరణ జరిపి తీరుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో 3 రాజధానులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని అన్నారు. వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడమని, అందుకే వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోమని చెప్పారు. వికేంద్రీకరణపై అసెంబ్లీలో కొత్తగా చట్టం చేయకూడదని ఈ మధ్య హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఇది రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణలకు దారి తీస్తుందని తెలిపారు. మాకు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం, గౌరవం ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

అలాగే రాజ్యాంగంలో ప్రతీ వ్యవస్థ స్వతంత్రమైనదేనని, ఎవరి పరిధిలో వారు ఉంటే సమస్యలు రావని సీఎం జగన్‌ పేర్కొన్నారు. సీఆర్డీఏ చట్టాలను వెనక్కి తీసుకున్నామని, వెనక్కి తీసుకున్న చట్టంపై తీర్పు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కేంద్రం కూడా ఈ విషయంలో తమ సమ్మతి తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసిందని, వికేంద్రీకణ పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశమని కేంద్రంగా స్పష్టంగా పేర్కొందని అన్నారు. అభివృద్ధి లేకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, వికేంద్రీకరణతోనే ఏపీలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారని, అందుకే తమకు అధికారం ఇచ్చారని, రాజధానిపై ఎవరికి వారు ఏదేదో ఊహించుకుంటున్నారని చెప్పారు. రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడతామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =