టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ బోణి కొట్టింది. భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ రజత పతాకాన్ని కైవసం చేసుకుంది. స్వర్ణ పతకం కోసం ఆదివారం జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్ క్లాస్-4 సింగిల్స్ విభాగం ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్, చైనీస్ ప్యాడ్లర్ యింగ్ ఝౌ చేతిలో 0-3 తేడాతో భవీనా పటేల్ ఓటమి పాలైంది. దీంతో భవీనా పటేల్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. అయితే పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో ఫైనల్ లోకి ప్రవేశించిన మొదటి భారతీయురాలిగా భవీనా పటేల్ చరిత్ర సృష్టించడమే కాకుండా, పారాలింపిక్స్ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్ లో భారత్ కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా భవీనా పటేల్ ప్రత్యేక గుర్తింపు పొందింది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటుగా పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ, క్రీడా, సినీరంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా భవీనా పటేల్ పై ప్రశంసలు కురిపించారు. క్రీడాకారుల్లో భవీనా ప్రదర్శన స్ఫూర్తి నింపుతుందని, పట్టుదలతో అసామాన్యమైన విజయాన్ని భవీనా సొంతం చేసుకుందని కొనియాడారు. మరోవైపు భవీనా పటేల్ రజత పతకం గెలుచుకోవడంతో గుజరాత్ లోని ఆమె స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సంచలనం నమోదు చేసి పతకంతో వస్తున్న భవీనాకు ఘనస్వాగతం పలుకుతామని గ్రామస్తులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ