టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయశక్తి, గ్రేటర్ నాయకులతో కేటీఆర్ విస్తృతస్థాయి సమావేశం

Jalavihar, KTR held Meeting with GHMC Party Leaders at Jalavihar, KTR Latest News, KTR Meeting with GHMC Party Leaders, KTR Meeting with Party Leaders, Mahmood Ali, Mango News, Minister Talasani, Sabitha Indra Reddy, TRS Party, TRS Party Meeting, TRS Working President KTR, TRS Working President KTR held Meeting with GHMC Party Leaders, TRS Working President KTR held Meeting with GHMC Party Leaders at Jalavihar

హైదరాబాద్ లోని జలవిహార్‌ లో మంగళవారం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ ఎంపీ కేశవరావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన పోరాటాన్ని కేటీఆర్ కార్యకర్తలు ముందు ఉంచారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఈ రోజు ప‌ద‌వులు వ‌చ్చాయంటే అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పై, పార్టీపై ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్టీ శ్రేణుల‌కు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తి :

ఇక 2014 నుంచి రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సంచలన విజయాలు సాధించి తిరుగులేని రాజకీయ శక్తిగా మారిందన్నారు. ఎన్నిక ఏదైనా ఆర్ఎస్ పార్టీకి రాష్ట్రప్ర‌జ‌లు నీరాజ‌నం పలికారని చెప్పారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ 60 ల‌క్ష‌లకుపైగా స‌భ్యుల‌తో బ‌లంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జిల్లా పార్టీ కార్యాల‌యాలు నిర్మించామని, ఇటీవలే ఢిల్లీలో కూడా తెలంగాణ భ‌వ‌న్‌కు భూమిపూజ నిర్వహించామని చెప్పారు. సెప్టెంబ‌ర్ 29వ తేదీలోగా జీహెచ్ఎంసీలో బ‌స్తీ, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బస్తీ క‌మిటీల్లో 15 మందికి త‌గ్గ‌కుండా ఉండేలా చూసుకోవాలన్నారు. డివిజ‌న్ స్థాయిలో కూడా 150 డివిజ‌న్ క‌మిటీలు వేసుకోవాలని సూచించారు. మరోవైపు త్వ‌ర‌లోనే రాష్ట్రంలో 500 నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ