తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వులు జారీ

Layout Regularisation Scheme, LRS Amendment Orders, LRS Fee, LRS Guidelines, New Layout Regularisation Scheme, New LRS Guidelines, telangana, Telangana Govt has Released LRS Amendment Orders, Telangana Layout Regularisation Scheme, Telangana Released LRS Amendment Orders, TS govt

రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ప్రజల నుండి, పలువురు నాయకుల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ముందుగా ఇచ్చిన జీవో 131 సవరిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ బుధవారం నాడు శాస‌న‌స‌భలో ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వులను గురువారం నాడు ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా కాకుండా, రిజిస్ట్రేషన్ తేదీ నాడు ఉన్న భూముల విలువ(వాల్యూ) ఆధారంగానే ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేయనున్నారు. అందుకు అనుగుణంగా 2015 నాటి ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ప్రకారమే ‌ఫీజులు వసూలు చేయనున్నారు.

లే అవుట్‌ రెగ్యులరైజేషన్ స్కీం ఫీజు:

  • చదరపు గజం మార్కెట్‌ వాల్యూ 3 వేల కంటే తక్కువుంటే 20 శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించాలి
  • చదరపు గజం మార్కెట్‌ వాల్యూ రూ.3,001 నుంచి రూ.5 వేల వరకు ఉంటే 30 శాతం
  • చదరపు గజం మార్కెట్‌ వాల్యూ రూ.5001 నుంచి రూ.10 వేల వరకు ఉంటే 40 శాతం
  • చదరపు గజం మార్కెట్‌ వాల్యూ రూ.10,001 నుంచి రూ.20 వేల వరకు ఉంటే 50 శాతం
  • చదరపు గజం మార్కెట్‌ వాల్యూ రూ.20,001 నుంచి రూ.30 వేల వరకు ఉంటే 60 శాతం
  • చదరపు గజం మార్కెట్‌ వాల్యూ రూ.30,001 నుంచి రూ.50 వేల వరకు ఉంటే 80 శాతం
  • చదరపు గజం మార్కెట్‌ వాల్యూ రూ.50 వేలకు పైగా ఉంటే 100 శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − five =