అఖండ రివ్యూ – మాస్ జాతర🔥🔥

Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Telugu Movie Review,Akhanda Movie Review,Akhanda Review,Akhanda Movie Updates,Akhanda Movie Public Talk,Akhanda Movie Rating,Akhanda Movie Live Updates,Nandamuri Balakrishna,Pragya Jaiswal,Boyapati Srinu

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన “అఖండ” చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయ్యిందా? తొలిసారి బాలకృష్ణ అఘోర గా కనిపించిన ఈ చిత్ర విశేషాలు చూద్దాం రండి..

చిత్రం: అఖండ
న‌టీన‌టులు: బాల‌కృష్ణ‌, ప్రగ్యా జైస్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ‌, సుబ్బరాజు, అవినాష్‌, సాయికుమార్‌, శ్రవ‌ణ్‌, ప్రభాక‌ర్, త‌దిత‌రులు
సంగీతం: త‌మ‌న్; ఛాయాగ్రహ‌ణం: సి.రాంప్రసాద్‌
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వర‌రావు, త‌మ్మిరాజు
క‌ళ‌: ఎ.ఎస్‌.ప్రకాశ్
మాట‌లు: ఎమ్‌.ర‌త్నం
పోరాటాలు: స్టంట్‌ శివ‌, రామ్, ల‌క్ష్మణ్‌
నిర్మాత‌: మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి
ద‌ర్శక‌త్వం: బోయ‌పాటి శ్రీను
సంస్థ‌: ద్వారక క్రియేష‌న్స్‌

కథ

మురళీకృష్ణ (బాలకృష్ణ) అనంతపురం జిల్లాలో ఉన్న ఎంతోమంది ఫ్యాక్షనిస్టులని మారుస్తూ మంచి మార్పునకు శ్రీకారం చుడతాడు. తన ప్రాంతంలో చాలా స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించి ఆ ప్రాంత ప్రజలకి సేవ చేస్తుంటాడు. ఆ జిల్లాకి కొత్తగా వ‌చ్చిన క‌లెక్టర్ శ‌ర‌ణ్య (ప్రగ్యాజైస్వాల్) ముర‌ళీకృష్ణ చేసే మంచి పనులు చూసి తనని ప్రేమిస్తుంది. తర్వాత ఇద్దరూ ఒక్కటవుతారు. ఆ ప్రాంతంలో వ‌ర‌ద రాజులు (శ్రీకాంత్) మైనింగ్ మాఫియాని న‌డుపుతుంటాడు. అక్కడ జరిగే త‌వ్వకాలతో చిన్నారుల ప్రాణాల‌కి ముప్పు ఏర్పడుతుంది.
దీనిని అడ్డుకునేందుకు మురళీకృష్ణ పూనుకుంటాడు. అప్పుడు తనకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? వ‌ర‌ద రాజులుకు అండగా ఉన్న మాఫియా లీడర్ ఎవరు? చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయిన ముర‌ళీకృష్ణ తోడబుట్టిన శివుడు (బాల‌కృష్ణ‌) ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ముర‌ళీకృష్ణని, అతని కుటుంబాన్ని శివుడు ఎలా ఆదుకున్నాడన్నదే మిగిలిన క‌థ‌.

ఎలా ఉంది?

హీరో ఇంట్రడక్షన్ మొదలుకొని చివ‌రి స‌న్నివేశం వ‌ర‌కు బాల‌కృష్ణ ఇమేజ్, బోయ‌పాటి మాస్ టేకింగ్ అద్భుతంగా కుదిరింది. అభిమానుల‌తో ఈల‌లు కొట్టించే ఎలివేష‌న్ స‌న్నివేశాలు అడుగ‌డుగునా ఉంటాయి. ముఖ్యంగా అఖండ పాత్రలో అఘోరా గా బాలయ్య నట విశ్వరూపం చూపించారు. ఈ పాత్రలో బాలయ్య నటన నభూతో… అన్నట్లుగా ఉంది. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పటంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. అఖండ పాత్రలో బాలయ్య పోరాటాలు సినిమాని మరో స్థాయిలో నిలపెట్టాయి.

ss థమన్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయిందని చెప్పాలి. పాటలు కానీ, రీరికార్డింగ్ కానీ అద్భుతంగా కుదిరాయి. హీరో శ్రీకాంత్ వ‌ర‌ద రాజులు పాత్రలో క్రూరమైన విలన్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అందంతో పాటు అభినయంలో కూడా ఆకట్టుకుంది. జ‌గ‌ప‌తిబాబు, కాల‌కేయ ప్రభాక‌ర్ త‌దిత‌రుల పాత్రలు కూడా సినిమాకి బలం చేకూర్చాయి.

చివరిగా

విడుదల అయిన అన్ని చోట్లా ఈ సినిమాకి మంచి ప్రజాదరణ లభిస్తోంది. మరోసారి బాలయ్య, బోయపాటి కాంబినేషన్ సూపర్ హిట్ గా నిలిచిపోయింది. బాలయ్య నటనకు సినీ ప్రముఖుల నుంచి కూడా అభినందనలు లభిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − nine =